మరో కోటి ఆఫర్‌ పట్టేసింది…!

Tamanna Item Song In Jaguar Costs 2 Cores

మిల్కీ బ్యూటీ తమన్నా ఈమద్య కాలంలో హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్‌లను అందుకోవడంలో విఫలం అవుతుంది. దాంతో ఈమెకు మెల్ల మెల్లగా ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఈమె తమిళంలో ‘క్వీన్‌’ రీమేక్‌లో మాత్రమే నటిస్తోంది. ఇక ఈమె తెలుగులో కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది కాని సఫలం అవ్వడం లేదు. ఈసమయంలోనే ఈమె హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టేందుకు కూడా ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటి వరకు పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌ చేసిన తమన్నా భారీ పారితోషికంతో పాటు, పెద్ద ఎత్తున ఐటెం సాంగ్‌ హీరోయిన్‌గా కూడా గుర్తింపు దక్కించుకుంది. తాజాగా కన్నడంలో ఈ అమ్మడు ఒక ఐటెం సాంగ్‌ను చేసేందుకు సిద్దం అయ్యింది. దాదాపు కోటి రూపాయల పారితోషికంను తమన్నా అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.Tamanna Item Song In Jaguar Costs 2 Cores

కన్నడ హీరో నటించిన ‘జాగ్వర్‌’ చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్‌ చేసిన విషయం తెల్సిందే. కోటి రూపాయల పారితోషికం తీసుకుని తమన్నా ఆ చిత్రాన్ని చేసింది. ఇప్పుడు జాగ్వర్‌ చిత్ర హీరో నిఖిల్‌కు అత్యంత సన్నిహితుడు మరియు మిత్రుడు అయిన యశ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్‌కు సిద్దం అయ్యింది. యశ్‌ సినిమాలో నిఖిల్‌ స్వయంగా తమన్నాతో మాట్లాడి ఐటెం సాంగ్‌కు ఒప్పించినట్లుగా తెలుస్తోంది. కేవలం వారం రోజుల్లోనే ఐటెం సాంగ్‌ చిత్రీకరణకు డేట్లు కేటాయించిన తమన్నా కోటి రూపాయలకు పైగా పారితోషికంను పుచ్చుకోనుంది. మొత్తానికి తమన్నా హీరోయిన్‌గా కాకున్నా కనీసం ఐటెం సాంగ్‌తో అయినా మంచి ఫేంను దక్కించుకుంటుంది.