ఇల్లీగల్ ఎఫైర్…మొగుడిని దారుణంగా నరికి చంపిన భార్య !

వివాహేతర సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలికొంది. భార్య అక్రమ సంబంధాన్ని భర్త అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురయిన భార్య ప్రియుడితో కలిసి కట్టుకున్నవాడిని దారుణంగా హత్య చేసింది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం బోయినపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుతున్న వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లక్ష్మీ, శివరాముడులకి 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు 20 రోజుల కిందటే పెళ్లయింది. అయితే అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో లక్ష్మీకి ఏడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. కాగా, వివాహేతర సంబంధంపై గురువారం రాత్రి శివరాముడు, లక్ష్మీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది


అదేరోజు రాత్రి ఇంటి ముందున్న అరుగుపై శివరాముడు పడుకున్నాడు. అతనిపై భార్య లక్ష్మీదేవి, ఆమె ప్రియుడు రామకృష్ణ కొడవలితో దాడి చేసి తలపై నరికి హతమార్చారు. ఉదయం ఇంటిమిద్దె పైనుంచి పడి మృతి చెందినట్లు నమ్మించారు. మిద్దె మీద మట్టి ఉండటం, తలపై గాయాలు ఉండడాన్ని పోలీసులు అనుమానించారు. శుక్రవారం రాత్రి శవపరీక్షలో హత్య అని తేలడంతో ఆరా తీశారు. నిందితులుగా రామకృష్ణ, లక్ష్మీలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో తామే శివరాములును హత్యచేశామని ఇద్దరూ ఒప్పుకున్నారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు.