నేచురల్‌ స్టార్‌ 10 ఏళ్లు పూర్తి

Nani on completing ten years as an actor, turning producer

టాలీవుడ్‌లో కేవలం బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంటేనే ఛాన్స్‌లు దక్కుతున్న సమయంలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఒక క్లాప్‌ బాయ్‌గా పని చేసిన నాని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్‌ఫుల్‌ హీరోగా పేరు తెచ్చుకున్న విషయం తెల్సిందే. క్లాప్‌ బాయ్‌గా చేస్తున్న నానిపై నమ్మకంతో మోహనకృష్ణ ఇంద్రగంటి హీరోగా ఛాన్స్‌ ఇచ్చాడు.

nani

‘అష్టాచమ్మా’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన నాని నేటికి 10 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అష్టాచమ్మా చిత్రం విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా నాని ప్రత్యేకంగా వేడుక జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్న నాని మరో వైపు బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.

nani

ఈ పది సంవత్సరాల కాలంలో నాని చాలా వైవిధ్యభరిత పాత్రలను పోషించాడు. తమిళంలో కూడా ఈయన ఒకటి రెండు చిత్రాలు చేసి అలరించే ప్రయత్నం చేశాడు. తెలుగులో ఎలాంటి పాత్ర అయినా సింపుల్‌గా, చాలా సహజంగా నటించి, మన పక్కింటి కుర్రాడేనా అనిపించేలా నటించిన నాని నేచురల్‌ స్టార్‌ అంటూ పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో అద్బుతమైన చిత్రాలతో పాటు బడిజాస్టర్స్‌ను కూడా దక్కించుకున్న నాని కెరీర్‌లో ఈమద్య చాలా స్పీడ్‌ మీదున్నాడు.

nani

గత రెండు సంవత్సరాల్లో నాని క్రేజ్‌ గ్రాఫ్‌ అమాంతం పైకి చేరింది. స్టార్‌ హీరోలకు సైతం పోటీ ఇచ్చే విధంగా నాని సినిమాలు రూపొందుతున్నాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ లేకున్నా కూడా ఇండస్ట్రీలో రాణించవచ్చు అనేది రవితేజ తర్వాత నాని నిరూపించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

nani