బీజేపీలోకి మోహన్ లాల్…!

Mohanlal-Join-In-BJP-Party
ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ బీజేపీలో చేరనున్నట్లు దేశవ్యాప్తంగా ఊహాగానాలు చెలరేగాయి. నిన్న కృష్ణాష్టమి రోజున ప్రధాని నరేంద్రమోడీతో మోహన్‌లాల్‌ సమావేశం అయినట్లు కొన్ని ఫోటోలు బయటకు రాగా వాటివలన ఈ ఊహాగానాలు చెలరేగాయని తెలుస్తోంది. విశ్వశాంతి ఫౌండేషన్‌ ద్వారా తాను చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ప్రధానికి వివరించడానికి మోహన్ లాల్ వచ్చారని బయటకు చెబుతున్నా మోహన్ లాల్ బీజేపీలో చేరి కేరళ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
mohanlal
రూ.500, రూ.1000 నోట్ల రద్దు, స్వచ్ఛ భారత్ సహా కేంద్రం తీసుకున్న పలు చర్యలను మోహన్ లాల్ గతంలో సమర్ధించారు. అందుకే మోహన్ లాల్ ను బీజేపీలో చేర్చుకుని కేరళలోని తిరువనంతపురం లోక్ సభ స్థానం నుంచి శశిథరూర్ పై పోటీ చేయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కేరళలో బీజేపీకి జనాకర్షక నేత లేరనీ, మోహన్ లాల్ తో ఆ లోటు తీరే అవకాశముందని వ్యాఖ్యానిస్తున్నారు.
mohanlal-modi