గుడ్ న్యూస్ :మోదీతో అకీరా..ఎమోషనల్‌ అయిన రేణూదేశాయ్‌..!

Good news: Akira with Modi.. Renudesai who is emotional..!
Good news: Akira with Modi.. Renudesai who is emotional..!

ఆంధ్ర ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ గారు అఖండ విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి అకీరా నందన్ తన తండ్రితోనే ఉంటా ఉన్నాడు . ఈ క్రమంలోనే పవన్ తన తనయుడిని రాజకీయ ప్రముఖులకి పరిచయం చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీని వీరు కలిసిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో అకీరా తల్లి రేణు దేశాయ్‌ ఒక ఎమోషనల్ పోస్ట్‌ పెట్టారు.

Good news: Akira with Modi.. Renudesai who is emotional..!
Good news: Akira with Modi.. Renudesai who is emotional..!

‘నాకు మొదటి నుంచి బీజేపీ అంటే చాలా అభిమానం. మోదీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. దాన్ని మాటల్లో వర్ణించలేను. మోదీ గారిని కలిశాక అకీరా నాకు ఫోన్‌ చేసి తన అనుభూతిని పంచుకున్నారు . ఆయన చాలా గొప్ప వ్యక్తి అని. తన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్‌ ఉందని చెప్పాడు’ అని ఈ పోస్టులో రాస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు రేణు.

మరోవైపు తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి పవన్‌ తన కుటుంబంతో సహా హాజరయ్యాడు . తన కుమారుడు అకీరాను సైతం దిల్లీకి తీసుకెళ్లి మోదీకు తన కుటుంబాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా అకీరా ప్రధాని మోదీకు నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోదీ మాట్లాడుతున్న ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.