‘ఫిదా’తో మధుప్రియకు సంబంధం ఏంటి?

madhu priya sings a song in varun tej fidaa movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Madhu Priya Sings A Song In Varun Tej Fidaa Movie

వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఫిదా’. ఈ చిత్రం విడుదలకు ముస్తాభవుతుంది. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర పక్కా తెలంగాణ అమ్మాయిగా కనిపించనుంది. ఒక పల్లెటూరు మాస్‌ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, ఆమె బిహేవియర్‌ ఎలా ఉంటుందో అచ్చు అలాగే సాయి పల్లవి ఉండనుంది. ఇప్పటికే ట్రైలర్‌లో సాయి పల్లవి పాత్ర ఎలా ఉంటుందో తేలిపోయింది. ఇక సాయి పల్లవిని పరిచయం చేస్తూ ఒక పాట తెలంగాణ యాసలో ఉంటుంది. 

అచ్చ తెలుగు తెలంగాణ పదాలతో సుద్దాల అశోక్‌ తేజతో దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఒక పాటను రాయించడం జరిగింది. ఆ పాట తెలంగాణ అమ్మాయి పాడితేనే, అదే యాసతో పాడితేనే హీరోయిన్‌ పాత్రకు సూట్‌ అవుతుందని దర్శకుడు శేఖర్‌ కమ్ముల భావించిన ఆ పాటను మధుప్రియకు అప్పగించాడు. శేఖర్‌ కమ్ముల అంచనాలను మధు ప్రియ అందుకుందట. సినిమాకు ఖచ్చితంగా ఆ పాట హైలైట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి ఏన్నో జానపధాలు పాడిన మధుప్రియ మొదటి సారి సినిమాల్లో పాడటం జరిగింది. ఆ పాట సక్సెస్‌ అయితే మధు ప్రియ సినిమాల్లో బిజీ అవుతుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు