బాహుబలితో ‘జై లవకుశ’ చిత్రానికి ఒక పోలిక!

Jai Lava Kusa Movie Launching Three Teasers Like Bahubali

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Jai Lava Kusa Movie Launching Three Teasers Like Bahubali

ఇటీవల టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకముందు టీజర్‌ మరియు ట్రైలర్‌తో సందడి చేస్తున్నాయి. ప్రతి సినిమాకు ట్రైలర్‌ మరియు టీజర్‌ తప్పనిసరి అయ్యాయి. దాదాపు అన్ని సినిమాలకు ఒక టీజర్‌ మరియు ఒక ట్రైలర్‌ విడుదల అవుతున్నాయి. కాని కొన్ని సినిమాలకు మాత్రం టీజర్‌ లేదా ట్రైలర్‌లు రెండు విడుదల చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ మాత్రం తన తాజా చిత్రం ‘జై లవకుశ’ చిత్రానికి మూడు టీజర్స్‌ను తీసుకు రాబోతున్నాడు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మాణంలో చేస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. దాంతో పాత్ర పాత్రకు ఒక టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు నిర్ణయించారు. ఇది కొత్త ట్రెండ్‌గా నందమూరి ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ హీరో మూడు టీజర్‌లతో రాలేదు. మూడు విభిన్న పాత్రలకు మూడు టీజర్‌లు అనే కాన్సెప్ట్‌ చాలా బాగుందని అంటున్నారు. స్వయంగా రాజమౌళి కూడా ఇది ఖచ్చితంగా వర్కౌట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులను ప్రోత్సహించినట్లుగా తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రం కోసం రాజమౌళి పాత్ర పాత్రకు పోస్టర్స్‌ను విడుదల చేసి వారిని పరిచయం చేశాడు. జక్కన్న తరహాలో కాస్త అడ్వాన్స్‌గా ఆలోచించి మూడు పాత్రలకు మూడు టీజర్‌లను విడుదల చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

అందర్ని అవాక్కయ్యేలా చేసిన అఖిల్‌