వర్మకు ఓకే చెప్పిన నాగ్‌.. త్వరలో షూటింగ్‌

nagarjuna next film with virinchil varma

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌లో ఎక్కువ మంది కొత్త దర్శకులతో సినిమాలు చేసిన హీరోగా నాగార్జునకు పేరుంది. ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాగార్జున మరోసారి కొత్త దర్శకుడితో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విరించి వర్మ త్వరలోనే నాగార్జునతో ఒక సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 

ప్రస్తుతం ‘రాజుగారి గది 2’ చిత్రంలో నాగార్జున నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ సినిమా విడుదల తర్వాత అఖిల్‌ రెండవ సినిమా నిర్మాణ కార్యక్రమాలను చూసుకునేందుకు నాగార్జున మూడు లేదా నాలుగు నెలలు సినిమాలకు గ్యాప్‌ తీసుకోనున్నాడు. అంటే నాగార్జున, విరించి వర్మల కాంబో మూవీ ఇదే సంవత్సరం నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జున నిర్మించాలని భావిస్తున్నాడు. వచ్చే సంవత్సరం వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు