ఈసారి ఎన్టీఆర్‌పై వర్మ చిత్రం

Ram Gopal Varma Decided To Make A Film Based On NTR's Biography

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Ram Gopal Varma Decided To Make A Film Based On NTR’s Biography

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితం అయ్యాడు. గత కొన్నాళ్లుగా తెలుగులో సినిమాలు చేసి, ఏ ఒక్కటి కూడా సక్సెస్‌ కాకపోవడంతో మళ్లీ బాలీవుడ్‌ వెళ్లిపోయాడు. బాలీవుడ్‌లో ప్రస్తుతం వర్మకు పెద్దగా కలిసి రావడం లేదు. దాంతో మళ్లీ తెలుగులోకి వస్తాడా అనే చర్చ జరుగుతుంది. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తాను అంటూ ప్రకటించాడు. వర్మ ఈ ప్రకటన ఎప్పుడెప్పుడు చేస్తాడా అని చాలా మంది చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవలే బాలయ్య తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేస్తాను అంటూ ప్రకటించాడు.

బాలయ్య సినిమాకు పోటీగా వర్మ తనదైన శైలిలో ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించి స్క్రిప్ట్‌ను కూడా సిద్దం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తెలుగు వారి ఖ్యాతిని దేశ వ్యాప్తంగా తెలిసేలా చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌ మాత్రమే అని, అందుకే ఆయన జీవిత చరిత్రతో సినిమా తీయాలని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాను చేయబోతున్న సినిమాలో పలు వివాదాస్పద అంశాలు ఉంటాయని, సగటు ఎన్టీఆర్‌ అభిమాని ఆయన జీవిత చరిత్ర ఎలా ఉండాలని కోరుకుంటాడో, ఏ అంశాలు ఉండాలని భావిస్తాడో అలాంటి కథతో ఆ అంశాలను తీసుకుని తాను ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే వర్మ హిందీలో ఆ సినిమాను తెరకెక్కించి, తెలుగులో డబ్బింగ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

దాసరి నిజంగానే లైపో చేయించుకున్నారా?