మరో సీక్వెల్‌కు కమల్‌ సిద్దం.. మరి రాజకీయాలు…!

Kamal Hassan Bharateeyudu Sequel

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాస్‌ దాదాపు రెండు దశాబ్దాల క్రితం చేసిన చిత్రం ‘భారతీయుడు’. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా భారతీయుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు భారతీయుడు 2 అంటూ ఆ చిత్రానికి సీక్వెల్‌ చేస్తున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సీక్వెల్‌కు శంకర్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇంకా భారతీయుడు 2 చిత్రం సెట్స్‌ పైకి వెళ్లకుండానే మరో సీక్వెల్‌కు ప్లాన్‌ చేస్తున్నట్లుగా కమల్‌ ప్రకటించాడు.

 

bharatheyuduu

కమల్‌ హాసన్‌ దాదాపు 26 ఏళ్ల క్రితం నటించిన తమిళ చిత్రం ‘దేవర్‌ మగన్‌’. ఆ చిత్రంలో శివాజీ గణేశన్‌తో కలిసి కమల్‌ నటించాడు. ఆ చిత్రం తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’ అనే టైటిల్‌తో డబ్‌ అయ్యింది. తమిళంతో పాటు తెలుగులో కూడా సంచలన విజయాన్ని ఆ చిత్రం దక్కించుకుంది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌ను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వీక్వెల్‌కు కమల్‌ స్వీయ దర్శకత్వం వహించబోతున్నాడు. కమల్‌ ఈమద్య రాజకీయాల్లోకి దిగిన విషయం తెల్సిందే. సినిమాలకు గుడ్‌ బై చెబుతాను అంటూ ప్రకటించిన కమల్‌ మళ్లీ ఇలా వరుసగా సినిమాలు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటా అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

bhatatheyudu