యంగ్ హీరో నాని తాజాగా ‘దేవదాస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ఏమాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడంతో పాటు, నాగార్జున, నానిల కాంబో సీన్స్ అలరించడంలో విఫలం అయ్యాయి. అందుకే కథల ఎంపిక విషయంలో మరియు ఇతర విషయాల్లో నాని మరింత జాగ్రత్త తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే త్వరలో చేయబోతున్న చంద్రశేఖర్ యేలేటి చిత్రంలో హీరోయిన్‌గా మొదట కాజల్‌కు ఓకే చెప్పిన నాని ఇప్పుడు మాత్రం నో అంటున్నాడు.
మైత్రి మూవీస్ బ్యానర్‌లో నాని హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కేందుకు సిద్దం అవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా మైత్రి మూవీస్ వారు కాజల్‌ను ఎంపిక చేయడం జరిగింది. కాని తాజాగా కాజల్ ఈ చిత్రానికి హీరోయిన్‌గా వద్దని నాని సూచించాడు. కాజల్‌తో నేను రొమాన్స్ చేయలేనని, ఇద్దరి మద్య లవ్ సీన్స్ ఏమాత్రం బాగోవు అంటూ నాని పేచి పెడుతున్నాడు. సోషల్ మీడియాలో కూడా నానికి కాజల్ ఆంటీ తరహాలో ఉంటుందని, వద్దని సలహా ఇస్తున్నారు. నాని కోసం ప్రస్తుతం దర్శకుడు కొత్త హీరోయిన్‌ను వెదికే పనిలో పడ్డాడు.