కౌశల్‌ వ్యాఖ్యలు అల్లరి పాలవుతున్నాయి…!

Kaushal To Enter Guinness Book Of World Records

బిగ్‌ బాస్‌ విన్నర్‌ కౌశల్‌కు ఏ రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో ఆయనకు వచ్చిన ఓట్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. అద్బుతమైన ప్రేక్షకాధరణ దక్కించుకున్న కౌశల్‌ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు వింత వింత ప్రయత్నాలు చేస్తూ, వింతగా ప్రకటనలు చేస్తున్నారు. హౌస్‌మెంట్స్‌ ఎవరు కూడా నాకు ఫోన్‌ చేసి అభినందించలేదు అంటూ విమర్శలు చేసిన కౌశల్‌ తనను తాను ఒక గొప్ప వ్యక్తి అని, ఒక స్టార్‌ సెలబ్రెటీని అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతున్నాడు.

kaushal-army-speech

తాజాగా కౌశల్‌ మీడియాతో మాట్లాడుతూ తనకు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ నుండి కాల్‌ వచ్చిందని, త్వరలోనే వారి నుండి అధికారికంగా సర్టిఫికెట్‌ రాబోతుందని ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అమెరికన్‌ యూనివర్శిటీ వారు నాకు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎందుకు డాక్టరేట్‌ రాబోతుందో మీకు త్వరలోనే తెలుస్తుందని చెప్పాడు. ఇక తాజాగా పీఎంఓ అంటే ప్రధాన మంత్రి ఆఫీస్‌ నుండి బిగ్‌ బాస్‌ విన్నర్‌గా నిలిచినందుకు అభినందిస్తూ కాల్‌ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇలా కాస్త అతి వ్యక్ల చేస్తూ విమర్శల పాలు అవుతున్నాడు. అవి వచ్చినప్పుడు, అధికారిక ఆధారాలతో చూపిస్తే పర్వాలేదు కాని, నాకు వారు కాల్‌ చేశారు, వీరు కాల్‌ చేశారు అంటూ మాట్లాడటంతో అల్లరి పాలవుతున్నాడు.

kaushal