బిగ్‌ బాస్‌ టైటిల్‌ వెనక్కిచేస్తా!

comments on kaushal

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2లో ఎనెన్నో నాటకీయ పరిణామాల మద్య కౌశల్‌ విజేతగా నిలిచిన విషయం తెల్సిందే. కౌశల్‌ బిగ్‌ బాస్‌ విన్నర్‌ అవుతాడని ఏ ఒక్కరు ఊహించలేదు. తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2లో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి రెండు వారాల్లోనే అద్బుతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. కౌశల్‌ ఆర్మీ ఏర్పాటు అయిన తర్వాత కౌశల్‌ క్రేజ్‌ ఇంకా పెరిగింది. కౌశల్‌తో పోటీకి వచ్చిన ప్రతి ఒక్కరిని కౌశల్‌ ఆర్మీ సాగనంపిన విషయం తెల్సిందే. తాజాగా కౌశల్‌ ఆర్మీ ఏ స్థాయిలో ఉందో కౌశల్‌ విన్నర్‌ అయిన తర్వాత జరిగిన ర్యాలీతో తేలిపోయింది. అయితే కొందరు మాత్రం కౌశల్‌ ఆర్మీ ఫేక్‌ అంటూ, పెయిడ్‌ ఆర్మీ అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కౌశల్‌ ఘటుగా స్పందించాడు.

babu gogineni comments on kaushal

ముఖ్యంగా బాబు గోగినేని విషయంలో కౌశల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కౌశల్‌ ఆర్మీ ఫేక్‌ అంటూ బాబు గోగినేని ఆరోపించాడు. డబ్బులు పెట్టి ఓట్లు కొనుగోలు చేసిన కౌశల్‌ విజేత అంటే నేను ఒప్పుకోను అంటూ బాబు గోగినేని చెప్పుకొచ్చాడు. బాబు గోగినేని విమర్శలపై స్పందించిన కౌశల్‌ తాను డబ్బులిచ్చి ఓట్లు కొనుగోలు చేసినట్లుగా నిరూపిస్తే ఏం చేసేందుకు అయినా సిద్దం అని, తన బిగ్‌ బాస్‌ టైటిల్‌ మరియు ప్రైజ్‌ మనీని వెనక్కు ఇచ్చేస్తాను అంటూ ప్రకటించాడు. నిరూపించి తన ముందుకు రావాలని బాబు గోగినేనికి కౌశల్‌ సవాల్‌ విసిరాడు.