గిన్నీస్‌ రికార్డ్స్‌లో కౌశల్‌ పేరు

Kaushal Army in Guinness World Records

బిగ్‌ బాస్‌ విన్నర్‌ కౌశల్‌ క్రేజ్‌ రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఒక సామాన్య సెలబ్రెటీగా ఎంట్రీ ఇచ్చిన కౌశల్‌ తన ప్రవర్తన మరియు క్రమశిక్షణ కారణంగా స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఎప్పుడు కూడా గేమ్‌ పట్ల శ్రద్ద చూపించడంతో పాటు తాను అనుకున్న మాటమీద నిలబడిన వ్యక్తి కౌశల్‌. అందుకే సోషల్‌ మీడియాలో కౌశల్‌ కోసం ఒక ఆర్మీనే ఫామ్‌ అయ్యింది. ఆ ఆర్మీ ఏ స్థాయిలో ప్రభావితం చూపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతర పార్టిసిపెంట్స్‌కు అందనంత భారీ ఓట్లను కౌశల్‌కు కౌశల్‌ ఆర్మీ కట్టబెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Kaushal Army

ఇప్పటి వరకు ఏ బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్‌కు రానన్ని ఓట్లను కౌశల్‌ పొందినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది. కౌశల్‌కు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ ది రికార్డ్స్‌ నుండి కాల్‌ వచ్చిందని, అత్యధిక ఓట్లను పొందిన మీకు గినీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో పేరు నమోదు చేస్తున్నట్లుగా కౌశల్‌కు చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా కౌశల్‌ ప్రకటించాడు. కౌశల్‌ ఈ విషయమై తనకు చాలా గర్వంగా ఉందని, తాను పడ్డ కష్టంకు తన అభిమానులు ఇచ్చిన గౌరవం అంటూ కౌశల్‌ పేర్కొన్నాడు. త్వరలోనే గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ రికార్డ్‌ ప్రతినిధులు తనను కలిసి సర్టిఫికెట్‌ను ఇవ్వబోతున్నట్లుగా కూడా కౌశల్‌ ప్రకటించాడు. ఇది తెలుగు ప్రేక్షకుల విజయం అంటూ ఆయన అన్నాడు.