బాబూ ఇక్కడ కొడితే కరకట్టకు పడ్డావ్, మోడీ చంకలో !

Telangana Nirudyoga Bruthi Kcr Announces Rs 3016

టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్, టీడీపీ టార్గెట్‌గా తెలంగాణ మహాకూటమిపై మాటల తూటాలు పేల్చారు . మహాకూటమి కాదు కాల కూట విషమని తాను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు పరిస్థితి ఏమవుతోందో చూడాలంటూ చంద్రబాబు నాయుడుపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ‘టీఆర్ఎస్‌ను ఓడగొట్టాలని కొందరు చూస్తున్నారని కుట్రల్లో ఇది కొత్త కుట్ర అని సిగ్గు పౌరుషం లేకుండా చంద్రబాబును తీసుకొస్తారని ఆయన తీవ్రంగా విమర్శించారు. నిన్న విజయవాడలో చంద్రబాబు మాట్లాడారట.. తెలుగోళ్లు ఒక్కటే.. ఇద్దరం ఒక్కటవుదామంటే కేసీఆర్ నా వెంట రాలేదన్నారట. నరేంద్ర మోదీ కేసీఆర్ ఒక్కటయ్యారని చెప్పారట.

Chandrababu and modi

మరి నాలుగేళ్లు ఆయన సంకలో ఉన్నదెవరు.. నరేంద్ర మోదీ కాళ్లు మొక్కి మా ఏడు మండలాలు లాక్కున్నారు. సీలేరు గుంజుకున్నారు.. హైకోర్టు విభజనను అడ్డకున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదా’అని ప్రశ్నించారు కేసీఆర్. ‘డబ్బా కొట్టే వార్తా సంస్తలు పెట్టుకొని.. చంద్రబాబు నంగనాచి మాటలు చెబుతున్నారు. మాతో గెలుక్కున్నావ్ జాగ్రత్త.. తెలంగాణ దెబ్బ తగిలితే అమరావతి కరకట్టకు పడ్డావ్.. మీ జోలికి మేం రాలేదు.. మాకు119 సీట్లు ఉంటే మీకు 175 సీట్లు ఉన్నాయి. అక్కడ మీ పరిస్థితి సరిగా లేదు. ఇక్కడ నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో చూస్కో. తెలుగు పేరు పెట్టి మా కొంపలు ఆర్పారు చంద్రబాబు ఇక్కడికి వస్తే దొడ్లలో బర్లు కూడా పారిపోతాయని ఆయన విమర్శించారు.

KCR Fair on Chandrababu

ఓటుకు నోటుతో మా ప్రభుత్వాన్నిపడగొట్టాలని చంద్రబాబు చూశారు. ఢిల్లీలో ఉన్న మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఫోన్ చేసి ఈ విషాయాన్ని నాకు చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చి నన్ను కలిసి రాష్ట్రం కోసం కలిసి కొట్లాడదామన్నారు.. మరుసటి రోజే మాకు మద్దతు తెలిపారు. కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి మాతో కలిశారు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మా పార్టీలో చేరారు. దీంతో మన సంఖ్య 75కి వెళ్లింది. ఆ తర్వాతే తెలంగాణలో కుట్రలు బంద్ అయ్యాయి. అలాంటి కుట్ర దారుడ్ని తెచ్చి ఊరేగతామంటున్నారు 58 ఏళ్ల పీడ పొతుందనకున్నా కాని మళ్లీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి, అమరావతికి తాకట్టు పెడుతున్నారు. పొరపాటున ఈ దుర్మార్గులు అధికారంలో వస్తే ప్రాజెక్టుల కట్టనిస్తారా.. వీరు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు.. ఈ కుట్రను తిప్పికొట్టాలి అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు.