బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ పై ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అభిమానంను చూపుతున్నారు. అయితే కొందరు మాత్రం ఆయన్ను తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. మొన్నటి వరకు కౌశల్ ఓట్లను నోట్లతో కొనుగోలు చేసి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు అంటూ ప్రచారం చేశారు. తాజాగా కౌశల్ ఒక ప్లే బాయ్ అంటూ ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌశల్ మాట్లాడుతూ తాను అమ్మాయిల చేయి పట్టుకునేందుకు అయితే బిగ్ బాస్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని, తాను ఆ కారణంతో వెళ్లలేదు అంటూ చెప్పుకొచ్చాడు.
అదే సమయంలో కౌశల్ భార్య నీలిమ మాట్లాడుతూ.. పెళ్లికి ముందు ఏమో కాని, పెళ్లి తర్వాత అయితే కౌశల్ చాలా మంచి మనిషి అని, పెళ్లి అయిన తర్వాత మా ఆయన బంగారం అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందు విషయాలు అన్ని కూడా నాతో షేర్ చేసుకున్నాడని, ఆయన ఒక ప్లే బాయ్ అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు అంటూ చెప్పుకొచ్చింది. కౌశల్ కు మాతో సమయం గడిపేందుకే వీలు పడదు, ఇక అలాంటి విషయాలకు అస్సలు ఛాన్స్ లేదు అంటూ నీలిమ చెప్పుకొచ్చారు.