ఆస్తులు అమ్ముకున్నాం.. ఇప్పుడు ఇలా అంటే ఎలా…!

Ghantasala Biopic Stirred Up A Controversy

తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం, తెలుగు వారు ఉన్నంత కాలం ఘంటసాల అనే పేరు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గాన గంధర్వుడుగా పేరు దక్కించుకున్న ఘంటసాల జీవిత చరిత్ర ఆధారంగా రామారావు అనే దర్శకుడు ‘ఘంటసాల’ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా షూటింగ్‌ అంతా పూర్తి చేసుకున్న తర్వాత తాను ఘంటసాల చిత్రాన్ని చేస్తున్నట్లుగా ప్రకటించాడు. సింగర్‌ కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో, ఆయన భార్య మృదుల ఘంటసాల భార్య పాత్రలో కనిపించబోతున్నారు.

gantasala-contrivarcy

ఘంటసాల సినిమా విడుదలకు సిద్దం అయ్యిందని అంతా భావిస్తున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు సంచలన ప్రకటన చేశారు. సినిమా ప్రారంభం సమయంలో ఏ ఒక్కరిని అడగకుండా, అనుమతి తీసుకోకుండా సినిమాను చేశారు. అందుకే తాము సినిమాను విడుదల కానివ్వం అంటూ తేల్చి చెప్పారు. దాంతో చిత్రాన్ని నిర్మించిన నిర్మాత మరియు దర్శకుడు రామారావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులను అమ్మి మరీ సినిమాను నిర్మించాను. ఇప్పుడు సినిమా విడుదల అడ్డుకుంటే మా పరిస్థితి ఏంటీ అంటూ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. ఘంటసాల గారిపై అభిమానంతో ఈ సినిమా తీశాను తప్ప, కోట్లు దండుకోవాలనే ఉద్దేశ్యం తనకు లేదు అంటూ పేర్కొన్నాడు.

gantasala