మా అనుమతి తప్పక తీసుకోవాల్సిందే…!

Ghantasala Biopic On Get Soon

టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. అరడజనుకు పైగా బయోపిక్‌లు తెరకెక్కుతున్న కారణంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వరుసగా బయోపిక్‌లు వస్తున్న ఈ సమయంలోనే గాన గంధర్వుడు ఘంటసాల బయోపిక్‌కు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సిహెచ్‌ రామారావు గత కొన్నాళ్లుగా ఘంటసాల గురించి రీసెర్చ్‌ చేయడం జరిగింది. తాజాగా గాయకుడు కృష్ణ చైతన్యతో కలిసి ఘంటసాల రీమేక్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. ఈ బయోపిక్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఘంటసాల వారసుడు ఘంటసాల రత్నకుమార్‌ మీడియా ముందుకు వచ్చాడు.

gantasala-and-son

తన తండ్రి గారు ఘంటసాల జీవిత చరిత్రతో సినిమాను తీస్తున్నాం అంటూ కొందరు ముందుకు వచ్చారు. అయితే వారు మాత్రం ఇప్పటి వరకు తనను సంప్రదించలేదు. మా అనుమతి లేకుండా మా నాన్న గారి సినిమా తీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చాడు.

rathna-kumar

ఒక వేళ మా అనుమతి తీసుకుని స్క్రిప్ట్‌ మాకు ఆమోదయోగ్యంగా ఉంటే పర్వాలేదు అంటూ రత్నకుమార్‌ అన్నారు. తెలుగులో ఇప్పటికే వచ్చిన ‘మహానటి’ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు ‘ఎన్టీఆర్‌’ ఇంకా పలు బయోపిక్‌లు వస్తున్నాయి. వాటితో పాటు ఈ చిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని అంతా అనుకున్నారు. కాని రత్నకుమార్‌ ఈ విషయంలో అడ్డు తగిలేలా ఉన్నాడు. దాంతో ఈ సినిమా పట్టాలెక్కడం కష్టమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

gantasala