ఇంకా తేలని టిక్కెట్ల లెక్క…రహస్య సమావేశం…!

Seat Sharing At Crucial Stage In Mahakutami

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహాకూటమిలో టెన్షన్ పెరుగుతోంది. సీట్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో కూటమి నాయకులు అందరూ తలలు పట్టుకుంటున్నారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కూడా కూటమి నేతలంతా రహస్యంగా సమావేశమైనట్లు తెలిసింది. గండిపేటలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ నాయకుడు ఎల్.రమణ, టీజేఎస్ అధినేత కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఓ ముఖ్య నేత హాజరైనట్లు సమాచారం.

kutami

ఈ చర్చలో మహాకూటమి పేరును మార్చాలనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే, సీట్ల పంపకం ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేసి, అభ్యర్థులను ఖరారు చేయాలని వెల్లడించినట్లు తెలిసింది. అలాగే ఈ సమావేశంలో కూడా సీట్ల పంపకం ఏకాభిప్రాయం కుదరనట్లు తెలిసింది. టీడీపీ 15 సీట్లు కోరుతుండగా.. కేవలం 9 సీట్లు ఇచ్చేందుకే కాంగ్రెస్ మొగ్గుచూపుతోంది. సీపీఐ కోరుతున్న ఆరు సీట్లలో మూడు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, టీజేఎస్ కోరిన16 సీట్లలో 8 సీట్లు మాత్రమే ఇవ్వగలమని కాంగ్రెస్ వెల్లడించడంతో ఇప్పుడు కూటమిలో ప్రతిష్టంభన నెలకొంది.

mahakutami-secreat