బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డాక్టరేట్, పీఎంవో కాల్ అంతా చీటింగే

Bigg Boss Telugu 2 Winner Kaushal Did Really Get A Call From Pm

మాటీవీ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ – 2 విన్నర్ కౌశల్ మంద ఆ షో ప్రసారమవుతున్న సమయంలో ఎంతమంది అభిమానులను తన ఆటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడో తెలిసిన విషయమే. ఎవ్వరితో కలవకుండా, గెలుపొక్కటే తన లక్ష్యమని ఇచ్చిన ప్రతి టాస్క్ ని సీరియస్ గా ఆడే కౌశల్ సిన్సియారిటీ కి తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. వీటికి తోడు కౌశల్ ఆర్మీ ఒకటి రంగంలోకి దిగి, కౌశల్ గెలుపు కోసం ఎంత చేయాలో అంత చేసి, బిగ్ బాస్ సీజన్ – 2 విన్నర్ కౌశల్ కాకపోతే, బిగ్ బాస్ షో కి తెలుగు లో భవిష్యత్తు లేదనే విధంగా షో నిర్వాహకులను భయపెట్టి, అంత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య ఫైనల్ రోజున కౌశల్ ని విన్నర్ గా ప్రకటించారు. ఆ ఫైనల్ డే రోజున అన్నపూర్ణ స్టూడియోని కౌశల్ ఆర్మీ ముట్టడించి, కౌశల్ కి వ్యతిరేకంగా ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరింపులు ఇచ్చేసరికి, హడావిడిగా అవార్డు ప్రధానం చేశారు షో నిర్వాహకులు. కౌశల్ కి కాస్త వ్యతిరేకంగా మాట్లాడిన పాపానికి హోస్ట్ గా చేస్తున్న హీరో నాని కి కూడా వ్యతిరేకంగా ఎన్ని చీవాట్లు పెట్టాలో అన్ని చీవాట్లు పెట్టారు నెటిజన్లు.

KAUSHAL-WINNER

ఇంతలా అభిమానాన్ని సంపాదించుకున్న కౌశల్ తనకి పీఎంవో నుండి కాల్ వచ్చిందని, త్వరలోనే ప్రధానిని కలుస్తున్నాని చెప్పడం, అలాగే హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇవ్వనున్నారని ఒక టీవీ షో లో చెప్పడం, కౌశల్ అభిమానులకి ఆనందం కలిగించినా, మిగతావారికి ఇదేదో బోగస్ వ్యవహారంలా ఉందే, కౌశల్ ని ఎవరో మిస్ లీడ్ చేస్తున్నారేమో అనే సందేహం కూడా కలిగింది. ఈ విషయం తేల్చడానికి టీవీ5 ఛానల్ మూర్తి, కౌశల్ ని ఇంటర్వ్యూ కి పిలిచి, ఈ రెండు వ్యవహారాల్లో ఎంత నిజముందో తేల్చారు. పీఎం ఆఫీస్ నుండి చంద్రమోహన్ అనే వ్యక్తి తనకు కాల్ చేసినట్లు కౌశల్ చెప్పి, ఆ నెంబర్ ని మూర్తి కి ఇవ్వగా, చంద్రమోహన్ మొత్తం వ్యవహారం కనుక్కున్నా టీవీ5, ఆ చంద్రమోహన్ ఒక చీటర్ అని, ఢిల్లీలో వాళ్ళకి వీళ్ళకి నేను పిఏ అంటూ చెప్పుకు తిరుగుతూ ఉంటాడని, అలా ఎలా ఒకరి మాటలు గుడ్డిగా నమ్ముతారని కౌశల్ ని అడిగాడు. ఆ తరువాత తనకి డాక్టరేట్ ఇప్పిస్తానని చెప్పిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తితో కూడా మహామూర్తి మాట్లాడి, ఆ రాజేంద్రప్రసాద్ కి, హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ కి ఏ సంబంధం లేదని, ఇదంతా బోగస్ వ్యవహారం అని, ఇటువంటి విషయాలను బహిరంగంగా ప్రకటించేముందు, పూర్తి వివరాలను కనుక్కోవాలని కౌశల్ కి మరోసారి సూచించాడు టీవీ5 మూర్తి.