కౌశల్ భార్యకు కాన్సర్ !

Bigg Boss Kaushal Wife In Cancer

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్‌పై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇస్తూ సంచలన విషయాన్ని బయటపెట్టారు కౌశల్. గురువారం నాడు హైదరాబాద్‌‌లో తన భార్య నీలిమతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన కౌశల్ ఆవేశంగా భావోద్వేగంగా మీడియాకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ నాపై కుట్రపూరితంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉండి సంపాదించిన ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు దుర్వినియోగం చేశానని ఆరోపిస్తున్నారని అన్నారు. నాకు ఫ్రైజ్ మనీగా వచ్చిన రూ. 50 లక్షలు క్యాన్సర్ పేషెంట్‌ల కోసం ఖర్చు చేస్తానని ప్రామిస్ చేశా. నా తల్లి పేదరికంతో సరైన వైద్యం లేకపోవడం వల్ల క్యాన్యర్‌తో చనిపోయింది. నా తల్లిలా మరొకరికి కాకూడదని నా ఫ్రైజ్ మనీ క్యాన్సర్ పేషెంట్‌ ల కోసం డొనేట్ చేస్తానని మాట ఇచ్చానని నాకు అన్ని టాక్స్ పోనూ చేతికి వచ్చింది రూ. 34 లక్షలు మాత్రమే. ఈ డబ్బుని నేను క్యాన్సర్ పేషెంట్‌లకు ఉపయోగిస్తున్నారు.

ఇప్పటికే విశాఖపట్నానికి చెందిన ప్రశాంతి అనే క్యాన్సర్ పేషెంట్‌ను దత్తత తీసుకుని వైద్యం చేయిస్తున్నా. ఆమెకు 25 వేలు చెక్ ఇచ్చా ఆ వీడియో ఉంది. ఆమెకు క్యాన్సర్ నుండి కోలుకునే వరకూ నేను ఖర్చుపెడతా అని ప్రామిస్ చేశా. ఆమె తరువాత ఇంకో పేషెంట్‌కు వైద్యం చేయిస్తా అంతేతప్ప క్యాన్సర్ ఉన్న ప్రతి పేషెంట్ వద్దకు వెళ్లి లక్షల రూపాయిలు ఇవ్వలేను. నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే నా భార్య నీలిమి నాకోసం ఎంతో కష్టపడింది. తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. నా తల్లి కోరికను తీర్చిడం కోసం నేను హీరోగా సినిమా చేయాలని నా భార్య ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. నా తల్లిలా నా భార్యకు కూడా క్యాన్సర్ ఉంది. కడుపులో కంతి పెట్టుకుని నా కోసం కష్టపడుతుంది. ఆమెపై కూడా ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఎమోషన్ అవుతూ తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు కౌశల్.