ఔను.. అవన్నీ ఫేక్‌ అని ఒప్పుక్ను కౌశల్‌…!

Big Boss Winner Kaushal Fake Doctorate

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌ తనకు పీఎంఓ నుండి అభినందిస్తూ కాల్‌ వచ్చిందని, గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం దక్కిందని, డాక్టరేట్‌ వచ్చిందని రకరకాల ప్రకటనలు ట్విట్టర్‌ ద్వారా చేసిన విషయం తెల్సిందే. బిగ్‌ బాస్‌ లో గెలిచినందుకు మరీ ఇంతగా అభినందనలు, డాక్టరేట్లు వస్తాయా అని అంతా అనుకున్నారు. కొందరు వాటిని పుకార్లే అని కొట్టి పారేశారు. కాని తాజాగా నిజంగానే అవన్ని ఫేక్‌ అంటూ కౌశల్‌ స్వయంగా ఒప్పుకున్నాడు. బిగ్‌ బాస్‌ లో గెలిచి వచ్చిన తర్వాత కొందరు నన్ను కలిసి డాక్టరేట్‌ ఇస్తామని, గిన్నీస్‌ బుక్‌ రికార్డు అంటూ తప్పుదోవ పట్టించారంటూ కౌశల్‌ తాజాగా టీవీ 5 మూర్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

KAUSHAL-WINNER

తనను కొందరు మోసం చేశారని, వారి మాటలు నమ్మి నేను అభిమానులతో షేర్‌ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. డాక్టరేట్‌ విషయంలో తన భార్య మొదటి నుండి అది నిజం కాదేమో అంటూ అనుమానం వ్యక్తం చేసింది. కాని నేను మాత్రం ఆమె మాట పట్టించుకోకుండా డాక్టరేట్‌ గురించి మీడియాకు తెలియజేశాను అంటూ చెప్పుకొచ్చాడు. మళ్లీ ఇటువంటి మోసాలకు తాను గురి కాను అంటూ కౌశల్‌ పేర్కొన్నాడు. అవి ఫేక్‌ కావచ్చు కాని, తనకు వచ్చిన ఓట్లు విషయంలో మాత్రం ఎలాంటి ఫేక్‌ లేదు అంటూ పేర్కొన్నాడు. ఇంకా తాను అన్నట్లుగా అభిమానులతో కలుస్తూ, వారితో తన అనుభవాలను షేర్‌ చేసుకుంటున్నాను అన్నాడు. ఇక సినిమా విషయం గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు అంటూ పేర్కొన్నాడు.

Kaushal To Enter Guinness Book Of World Records