రజినీకాంత్ పెట్టా సినిమా ముఖ్య తేదీలు ఇవే.

Rajinikanth-Petta-Movie-Aud

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న పెట్టా సినిమా షూటింగ్ సంక్రాంతి కి విడుదల అయ్యేందుకు వేగంగా జరుపుకుంటుంది. రజినీకాంత్ నడిచిన గత చిత్రం కాలా కొంతమందిని ఆకట్టుకున్నప్పటికీ, అందులో రజినీకాంత్ స్టైల్, మేనరిజం సరిగ్గా కనపడకపోయేసరికి అభిమానులు దిగులు చెందారు. ఇక ఆ దిగులుని దూరం చేయడానికి, రజినీకాంత్ తమిళంలో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరున్న కుర్ర డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తో జతకట్టి, మంచి మాస్ మసాలా సినిమాకి రెడీ అయ్యారు. ఈ సినిమాలో రజినీకాంత్ కి జతగా త్రిష, సిమ్రాన్ లు నటిస్తుండడంతో రజినీకాంత్ రెండు పాత్రలను చేయబోతున్నారని తెలుస్తుంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తన తొలి సినిమా పిజ్జా తోనే సౌత్ ఇండియా ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు.ఆ సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్ సేతుపతి ఇప్పుడు తమిళంలో స్టార్ హీరోగా, విభిన్నమైన సినిమాలను చేస్తూ, ఒక వెలుగు వెలుగుతున్నాడు.

రజినీకాంత్ పెట్టా సినిమా ముఖ్య తేదీలు ఇవే. - Telugu Bullet

ఈ డైరెక్టర్ నుండి వచ్చిన జిగర్తండా, ఇరవి, మెర్క్యూరీ సినిమాలలో జిగర్తండా, మెర్క్యూరీ సినిమాలో తెలుగు లో విడుదల అయ్యాయి. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో మేఘ సుభాష్ (లై ఫేమ్), విజయ్ సేతుపతి, శశికుమార్, బాబీ సింహ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖ్కీ విలన్ గా నటిస్తున్నాడు. రజినీకాంత్ నటించిన గత చిత్రం కాలా లో కూడా బాలీవుడ్ నటుడు నానా పటేకర్ విలన్ గా నటించడం గమనించాల్సిన విషయం.ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని డిసెంబర్ 16 వ తేదీన విడుదల చేయాలనీ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే ఈ సినిమా టీజర్ ని డిసెంబర్ 12 న రజినీకాంత్ పుట్టినరోజు ని పురస్కరించుకొని విడుదల చేయనున్నారని సమాచారం. పెట్టా సినిమా సంక్రాంతికి విడుదల అని ప్రకటించినప్పటికీ, తేదిని మాత్రం ప్రకటించలేదు. ఇన్ని విశేషాలున్న ఈ సినిమా రజిని అభిమానులని ఎంతలా ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సిందే.