సైంధ‌వ్ మూవీ ట్రైల‌ర్ వచ్చేసింది ..!

సైంధ‌వ్ మూవీ ట్రైల‌ర్ వచ్చేసింది ..!
Cinema News

శైలేష్ కోలన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ సైంధవ్. వెంకట్ బోయిన్పల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇది వెంకటేష్ కు 75వ మూవీ కావడం విశేషం. ఆయన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సైంధ‌వ్  మూవీ ట్రైల‌ర్ వచ్చేసింది ..!
Saindhav Movie

ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు ,తమిళం ,కన్నడం మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ మూవీ యొక్క సెన్సార్ పనులు పూర్తి అయినాయి. 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో వస్తున్న ఈ మూవీ కి సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇందులో జెర్సీ ఫిలిం శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుంది.నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు ఈ మూవీ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే.. తాజాగా విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ సైంధవ్ ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. ఇందులో వెంకీ చాలా భయంకరంగా కనిపించాడు.