సంక్రాంతి రేస్ లో ఓడిన సినిమా…నాలుగిట్లో ఇది ఒక్కటే పాపం..?

సంక్రాంతి రేస్ లో ఓడిన సినిమా…నాలుగిట్లో ఇది ఒక్కటే పాపం..?
Cinema News

ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సినిమాల విషయానికి వస్తే జనవరి 18న మహేష్ బాబు గుంటూరు కారం, తేజా సజ్జ హనుమాన్ విడుదల కాగా.. జనవరి 13న వెంకటేష్ సైంధవ్…జనవరి 14న నాగార్జున నా సామిరంగా చిత్రాలు విడుదలయ్యాయి.

ఈ నాలుగు చిత్రాలలో ముందు నుంచి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాపై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకోవడంతో అలానే త్రివిక్రమ్ మార్క్ కనిపించకపోవడంతో…ఈ సినిమా సూపర్ హిట్ కి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. మరో పక్క అదే రోజు రిలీజ్ అయిన హనుమాన్ ప్రస్తుతం ఉన్న సంక్రాంతి సినిమాలలో విన్నర్ గా దూసుకుపోతోంది. 100 కోట్ల క్లబ్ చేరిపోయి 200 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తోంది.

సంక్రాంతి రేస్ లో ఓడిన సినిమా…నాలుగిట్లో ఇది ఒక్కటే పాపం..?
The movie that lost in the Sankranti race… this is the only sin among the four..?

సంక్రాంతికి వెంకటేష్ సినిమా అంటే అలానే ఆయన 75వ సినిమా అంటే.. విపరీతంగా ఎదురుచూసేది ఫ్యామిలీ ఆడియన్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ వెంకటేష్ ఈ లాజిక్ మిస్ అయ్యి ఫ్యామిలీ స్టోరీ కాకుండా ఒక యాక్షన్ సినిమాతో ఈ సంక్రాంతికి మన ముందుకు వచ్చారు. ఈ లాజిక్ మిస్ ఫైర్ అయ్యి నాలుగు సినిమాలలో మరీ డిజాస్టర్ గా మిగిలిపోయింది వెంకటేష్ సైంధవ్ చిత్రం.