Breaking News: బిగ్ బిగ్ రిలీఫ్.. తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్ విడుదల

Breaking News: Big Big Relief.. Tammineni Veerbhadram Health Bulletin released
Breaking News: Big Big Relief.. Tammineni Veerbhadram Health Bulletin released

Cpm తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్‌ విడుదల అయింది. ప్రస్తుతం నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం ఉందని వైద్యులు పేర్కొన్నారు. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్ కు చేరుకుంటున్నాయని ప్రకటించారు వైద్యులు.

లంగ్స్ లో నీరును తొలగిస్తున్న వైద్యులు..ICU లో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. అలాగే, మెడిసిన్ కు Cpm తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రెస్పాండ్ అవుతున్నారు అంటున్నారు వైద్యులు. ఇక ఇవ్వాళ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా ఇప్పుడు ఆయన ఐసీయూలో ఉండగా, అతనికి వివిధ రకాల వైద్య పరీక్షలు చేయగా గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు . ఊపిరితిత్తులలో నీరు తొలగించడానికి ప్రయత్నిస్తున్నామనీ ప్రకటించారు.డాక్టర్ డీఎన్ కుమార్,డాక్టర్ సోమ రాజు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ఏఐసీ ఆసుపత్రి సిబ్బంది ప్రకటించింది.