సైంధవ్: ఉత్కంఠ పూరిత ట్రైలర్ ఎప్పుడు?

సైంధవ్: ఉత్కంఠ పూరిత ట్రైలర్ ఎప్పుడు?
Cinema News

విక్టరీ వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ సినిమా సైంధవ్. ఈ సినిమా లో శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుండగా నిహారికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

సైంధవ్: ఉత్కంఠ పూరిత ట్రైలర్ ఎప్పుడు?
Saindhav Movie

ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకోగా సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ ని జనవరి మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా లో ఆర్య, ఆండ్రియా, రుహాణి శర్మ, ముఖేష్ రుషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా సైంధవ్ సినిమా ని అన్ని కార్యక్రమాలు ముగించి జనవరి 13న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.