ఓటీటీలోకి ముందుగానే వచ్చేస్తున్నసైంధవ్..?

ఓటీటీలోకి ముందుగానే వచ్చేస్తున్నసైంధవ్..?
Cinema News

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ మరియు ఎమోషనల్ డ్రామా గా రిలీజ్ అయ్యింది కానీ ఈ మూవీ థియేటర్స్ లో అనుకున్న రేంజ్ సక్సెస్ అయితే అందుకోలేదు. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నట్టుగా బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

ఓటీటీలోకి ముందుగానే వచ్చేస్తున్నసైంధవ్..?
Saindhav Movie

మరి ఈ బజ్ ప్రకారం ఈ మూవీ ఈ ఫిబ్రవరి 2 నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంది అని టాక్. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుకున్న సంగతి తెలిసిందే. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.