అప్పుడే బయటకు వెళ్లాలనుకున్నా: కౌశల్‌…!

BIGG BOSS 2 Housemates Targeting Kaushal

పలు భాషల్లో సక్సెస్‌ అయిన ‘బిగ్‌బాస్‌’ షో తాజాగా తెలుగులో కూడా రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఎన్నో ఆటుపోట్లు, అవమానాలను ఎదుర్కొని ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2 విజేతగా కౌశల్‌ నిలిచాడు. ఈ సందర్భంగా కౌశల్‌ పలు ఇంటర్య్వూలో మాట్లాడుతూ తనకు ఇంట్లో ఎదురైన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజాగా ఓ షోకు ఇంటర్య్వూ ఇచ్చిన కౌశల్‌ ఇంట్లో వాళ్లంతా తనని టార్గెట్‌ చేశారని, నన్ను బయటకు పంపడానికి వాళ్లంతా ఎన్నో కుట్రలు చేశారని చెప్పుకొచ్చాడు. అవన్నీ భరించలేక రెండో వారంలోనే తాను బయటకు రావాలనుకున్నాడట.

kaushal-army-kaushal

ఇకపోతే ఒకానొక సమయంలో నూతన్‌ నాయుడు మరియు కౌశల్‌ ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తనని పంపమని కౌశల్‌ నానిని అడిగితే నాని అప్పుడు తన కౌశల్‌ ఆర్మీ గురించి వివరించాడట. దాంతో ఇక కౌశల్‌ ఆర్మీ కోసమైనా ఆడాలని గట్టిగా నిర్ణయించుకున్నా అంటూ కౌశల్‌ చెప్పుకొచ్చాడు.

KAUSHAL-WINNER

అంతేకాకుండా ఆ ఇంట్లో ఉండాలంటే చాలా ఓర్పు ఉండాలి, మనం ఆ ఇంటికి ఎందుకు వెళ్లాం అనేది గర్తుంచుకుని, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని కౌశల్‌ చెప్పుకొచ్చాడు. చివరకు అన్నీ అవమానాలను ఎదుర్కొని విజేతగా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ కౌశల్‌ తన విజయ రహస్యాన్ని వివరించాడు.

KAUSHAL-ARMY