తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ మరో రెండు వారాల్లో ముగియబోతుంది. ఇప్పటికే ఇంట్లో ఫైనల్ వాతావరణం కనిపిస్తుంది. గత సీజన్‌లో మాదిరిగానే ఈ సీజన్‌లో కూడా ఇంటి సభ్యులకు సంబంధించిన వారి సన్నిహితులను బిగ్ బాస్ లోనికి పంపించడం జరిగింది. తమ ఆప్తులు రావడంతో ఇంటి సభ్యులు ఆనందంలో మునిగి పోయారు. టీవీ9 దీప్తి భర్త బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లాడు. దీప్తి ఆట గురించి, ఆమె హౌస్‌లో ప్రవర్తిస్తున్న తీరును అభినందించాడు. బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యిందని కూడా ఆయన అన్నాడు. ఇక తనీష్‌తో జరుగుతున్న వివాదాల గురించి కూడా ఆయన స్పందించాడు.
టికెట్ టు ఫినాలే టాస్క్‌లో తనీష్ కాస్త అతి చేశాడు. దీప్తిపై మ్యాన్ హ్యాండ్‌లింగ్ చేయడంతో ఆమె చాలా ఇబ్బంది పడటం జరిగింది. దానికి తోడు ఆమెను పదే పదే నామినేషన్‌లో పెట్టడం వల్ల కూడా దీప్తి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇదే విషయాన్ని తనీష్‌తో దీప్తి భర్త సున్నితంగా హెచ్చరించాడు. ఫిజికల్ టాస్క్‌లు చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించాడు. ఆడవారు అనే విషయాన్ని మర్చిపోద్దు అంటూ తనీష్ కు ఆయన సూచించడం జరిగింది. దీంతో తనీష్‌పై పెద్ద స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. తనీష్‌పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.