తనయుడు, కోడలికి సమాన సపోర్ట్‌

nagarjuna Equal supports chai and sam

అక్కినేని వారి నుండి రేపు ప్రేక్షకుల ముందుకు రెండు చిత్రాలు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన నాగచైతన్య శైలజా రెడ్డి అల్లుడు మరియు సమంత హీరోయిన్‌గా నటించిన యూటర్న్‌ చిత్రాలు కూడా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు చిత్రాలకు భార్య భర్తలు అయిన సమంత మరియు నాగచైతన్యలు పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. తమ సినిమా చూడండి అంటే తన సినిమా చూడండి అంటూ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ రెండు చిత్రాలపై ఉంది.

samantha uturn movie posters

ఇటీవలే నాగార్జున తన కొడుకు శైలజ రెడ్డి అల్లుడు చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్నాడు. కొడుకు చిత్రానికి ప్రమోట్‌ చేసి కోడలు సినిమాను వదిలేస్తే విమర్శలు వస్తాయని భావించాడో ఏమో కాని, తాజాగా సమంతతో కలిసి యూటర్న్‌ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. తన కోడలు నటించిన ఈ చిత్రం అందరిని అలరిస్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. ఇదో విభిన్నమైన సినిమా అంటూ, సమంత ఇలాంటి చిత్రంలో నటించేందుకు ముందుకు రావడం అభినంద నీయం అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ రెండు సినిమాలను నాగార్జున సమాన దృష్టితో ప్రమోట్‌ చేయడ అక్కినేని అభిమానులకు సంతోషం కలిగించింది.

chai and sam