పాపం గీతను ప్రశాంతంగా ఉండనివ్వండి

geetha govindam movie collections

గీత గోవిందం చిత్రంతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిన ముద్దుగుమ్మ రష్మిక మందన గతంలో కన్నడ నటుడు రక్షిత్‌తో చేసుకున్న వివాహ నిశ్చితార్థంను రద్దు చేసుకున్న విషయం తెల్సిందే. గీత గోవిందం చిత్రం విజయంతో కోట్ల పారితోషికాలు ఈమెకు వస్తున్న కారణంగా రక్షిత్‌తో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కన్నడ నటుడు రక్షిత్‌ అభిమానులు ఈ విషయంలో రష్మికపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఆమె నటించిన సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా ఆఫర్లు వస్తున్న కారణంగానే నిశ్చితార్థంను రద్దు చేసుకున్నట్లుగా కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Geetha Govindam box office

మీడియాలో వార్తలపై రక్షిత్‌ స్పందించాడు. రష్మికపై విమర్శలు ఆపండి, ఇదరం చర్చించుకుని నిశ్చితార్థంను రద్దు చేసుకున్నామని, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. గత కొన్ని రోజులుగా తమ మద్య కొన్ని విభేదాలు జరుగుతున్నాయి. ఆ విభేదాల కారణంగానే తాము కలిసి జీవించడం అసాధ్యం అనే నిర్ణయానికి వచ్చాం. అందుకే పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వచ్చిందని, అంతే తప్ప ఆమెను ఎవరు ట్రోల్‌ చేయవద్దని రక్షిత్‌ కోరాడు. తమ ఇద్దరి అభిప్రాయాలు కలవక పోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయంలో ఆమెను ఒక్కదాన్ని బలి చేయడం కరెక్ట్‌ కాదు అంటూ రక్షిత్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులను కోరడం జరిగింది.