కౌశల్‌ క్రేజ్‌కు ఇది మరో నిదర్శణం…!

Mahesh Babu Superb Tweet On Bigg Boss Winner Kaushal

తెలుగు బిగ్‌ బాగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేత కౌశల్‌కు రోజు రోజుకు ఆధరణ పెరుగుతోంది. భారీ ఎత్తున ప్రేక్షకుల ఆధరణ, అభిమానం దక్కించుకున్న కౌశల్‌ విజేతగా నిలిచాడు. కౌశల్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన వారు కౌశల్‌ ఆర్మీ. వారి మద్దతుతోనే కౌశల్‌ ఈ విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక కౌశల్‌ ఈ షోతో ఎంతగా ప్రేక్షకుల ఆధరణ దక్కించుకున్నాడో సెలబ్రెటీల అభిమానంను కూడా పొందాడు. ఇప్పటికే కౌశల్‌ బిగ్‌బాస్‌ విన్నర్‌ అయిన నేపథ్యంలో ఎంతో మంది శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా కౌశల్‌ కు మహేష్‌ బాబు కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు.

mahesh

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ అయిన కౌశల్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేయడంతో పాటు, నీ విజయం నాకు సంతోషంగా ఉందని, విజయాన్ని ఎంజాయ్‌ చేయి అంటూ కౌశల్‌ను ఉద్దేశించి మహేష్‌ బాబు ట్వీట్‌ చేశాడు. ఇలాంటి విషయాల్లో మహేష్‌బాబు అస్సలు పట్టించుకోడు. కాని కౌశల్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పడంతో మహేష్‌బాబుపై కౌశల్‌ ఆర్మీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక అప్‌కమింగ్‌ నటుడిని మీలా ఎవరు కూడా గుర్తించలేరు, మీలా ఎవరు కూడా గౌరవించలేరు అంటూ కౌశల్‌ ఆర్మీ మహేష్‌ బాబును ఉద్దేశించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

kaushal-big-boss