“గుంటూరు కారం” కి బుల్లితెర పై సూపర్ రెస్పాన్స్ .. !

Super response to "Guntur Karam" on the big screen .. !
Super response to "Guntur Karam" on the big screen .. !

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. డిజిటల్ ప్రీమియర్ గా సూపర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అయితే ఇటీవల ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో ప్రసారం అయ్యింది.

Super response to "Guntur Karam" on the big screen .. !

Super response to “Guntur Karam” on the big screen .. !

తాజాగా ఈ మూవీ కి సంబందించిన టీఆర్పీ రేటింగ్ వెలువడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క గుంటూరు కారం మూవీ కి 9.23 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది గుడ్ రెస్పాన్స్ అని చెప్పాలి. గత మూవీ సర్కారు వారి పాటకి స్టార్ మా ఛానెల్ లో 9.45 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. కాకపోతే మహేష్ లాంటి స్టార్ హీరో మూవీ కు డబుల్ డిజిట్ ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ మూవీ కి సంగీతం అందించారు.