అరవింద సమేత వేడుకలో హీరోయిన్‌ మిస్సింగ్‌కు కారణం…!

Pooja Hegde First Salary 200 Rupees

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అరవిందసమేత’ చిత్రం షూటింగ్‌ ప్రీరిలీజ్‌ వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క నటీ నటులు మరియు టెక్నీషియన్స్‌ వేడుకలో పాల్గొన్నారు. కాని హీరోయిన్‌ పూజా హెగ్డే మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. ఈ వేడుకలో ఆమె లేకపోవడం పెద్ద లోటుగా సినీ వర్గాల వారు అంటున్నారు. ఇంత పెద్ద హీరో సినిమా వేడుకలో హీరోయిన్‌ లేకపోవడం ఏంటో అంటూ కొందరు చెవులు కొరుకున్నారు. అయితే రావాలని అనుకున్నా కూడా రాలేని పరిస్థితుల్లో తాను ఉన్న కారణంగా రాలేక పోయాను అంటూ చెప్పుకొచ్చింది.

ntr-movies

‘అరవింద సమేత’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక ముందు నిర్ణయించని కారణంగా తాను జెరుసలేంలో షూటింగ్‌కు కమిట్‌ అయ్యాను. ఈ షూటింగ్‌ కారణంగానే నేను సినిమా వేడుకలో పాల్గొనలేక పోయాను అంటూ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్‌ ఎమోషన్‌ను తాను అర్థం చేసుకోగలను అని, ఆయన ఎమోషన్‌ అయిన సందర్బంలో తాను కూడా చాలా ఫీల్‌ అయ్యాను అంటూ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. సినిమా విడుదల సమయంకు తాను ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌ వస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అక్టోబర్‌ 11న దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంకు థమన్‌ సంగీతం అందించాడు.

ntr