బిగ్​బాస్-7లో ఊహించని ఎలిమినేషన్..ఇంతకీ ఎవరు..?

బిగ్​బాస్-7లో ఊహించని ఎలిమినేషన్..?
Entertainment

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 నుంచి ఆరోవారం ఊహించని ఎలిమినేషన్ జరిగింది. ఈ కంటెస్టెంట్ ఎలిమినేషన్ హౌజ్​మేట్స్ అందర్నీ కంటతడి పెట్టించింది. ఇంతకీ ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరు అంటే ….. ?

బిగ్​బాస్ సీజన్-7.. ఉల్టా పుల్టాలో ఆరో వ వారం హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్‌ అయ్యింది . వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టిన పావని కేవలం వారంలోనే బిగ్‌ బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చేసినా.. ఈ బ్యూటీ ఎలిమినేషన్ చూస్తే ఆమె కంటెస్టెంట్లతో ఎంతగా కలిసిపోయిందో తెలిసిపోతుంది. మరియు ఈ వారం నామినేషన్స్‌లో అమర్‌దీప్‌, టేస్టీ తేజ, అశ్విని, ప్రిన్స్‌ యావర్‌, పూజ, శోభాశెట్టి, నయని పావని ఉండగా చివరకు అశ్విని, నయని పావని మిగిలిపోయారు .

బిగ్​బాస్-7లో ఊహించని ఎలిమినేషన్..?
Bigg Boss

చివరలో నయని పావని ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. తన పేరును ప్రకటించగానే పావని ఎమోషనల్ అయింది. హౌస్ నుంచి వెళ్లేటప్పుడు.. కంటెస్టెంట్లతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ అందరి గురించి ఒక్కొక్క మాట చెప్పి వెళ్లిపోయింది. అంతకు ముందు ‘భగవంత్‌ కేసరి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి, శ్రీలీల హౌస్‌మేట్స్‌తో సందడి చేశారు.