‘నోటా’ తర్వాత మూడు భాషల్లో…!

Vijaydevarakonda Started With Three Languages Movie

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను కలిగి ఉన్నాడు. రికార్డు స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగి ఉండటంతో పాటు, ఈయన చేస్తున్న ప్రతి సినిమాతో అభిమానులను మరియు అంతకు మించిన స్టార్‌డంను దక్కించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగులో స్టార్‌ హీరోలు తమిళంలో డైరెక్ట్‌గా సినిమా చేసి ఆకట్టుకోలేక పోయారు. కాని తెలుగు నుండి మొదటి సారి విజయ్‌ దేవరకొండ అక్కడ స్టార్‌డంను సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ‘నోటా’ చిత్రంతో తమిళనాట విజయ్‌ దేవరకొండ బ్లాక్‌ బస్టర్‌ హీరోగా అవతరించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

vijaya

‘నోటా’ చిత్రం విడుదల కాకుండానే మరో సినిమాకు విజయ్‌ దేవరకొండ సిద్దం అయ్యాడు. ఈసారి తెలుగు మరియు తమిళంలోనే కాకుండా మలయాళంలో కూడా సినిమా తెరకెక్కబోతుంది. మూడు భాషల్లో రూపొందబోతున్న ఈ చిత్రంను తమిళ నిర్మాత ఎస్‌ ఆర్‌ ప్రభు నిర్మించబోతున్నాడు. అందుకు సంబంధించిన అడ్వాన్స్‌ను కూడా విజయ్‌ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ‘డియర్‌ కామ్రేట్‌’ చిత్రం విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే ఈ మూడు భాషల చిత్రంను ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తానికి విజయ్‌ దేవరకొండ మల్టీ లాంగ్వేజ్‌ హీరోగా గుర్తింపు దక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల ఫలితం ‘నోటా’ విడుదల తర్వాత తేలిపోయే అవకాశం ఉంది.

vijay-devarakonda-movies