ఖుషి మేనియా షురూ.. ఫస్ట్ డే కలెక్షన్స్ చుస్తే మతి పోతుంది..?

ఖుషి మేనియా షురూ.. ఫస్ట్ డే కలెక్షన్స్ చుస్తే మతి పోతుంది..?
Movie News

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటించినమూవీ ఖుషి. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరికి ఖుషిసినిమా కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్​ను సంపాదించుకుంది. మరోవైపు మొదటి రోజు కలెక్షన్లు కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే వచ్చాయని ట్రేడ్ వర్గాల టాక్.

ఖుషి మేనియా షురూ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
Vijay Devarakonda, Samantha

ఖుషి మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్లు అంట .. మొత్తంగా రూ.41 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపేసాయి . కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. వరల్డ్ వైడ్​గా ఈ చిత్రం రూ. 52.50 కోట్లు బిజినెస్ చేసిందట.ఈ మూవీ కు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 9.50 నుంచి రూ.10.00 కోట్లు షేర్ వసూలు వచ్చినట్లు ఉన్నది . ప్రపంచవ్యాప్తంగా రూ. 13.20 నుంచి రూ.13.50 కోట్ల వరకు షేర్ అందుకుందట.