“ఖుషి” మూవీ ఇంతకీ ఏ ఓటిటిలో వస్తుందంటే..?

“ఖుషి” మూవీ ఇంతకీ ఏ ఓటిటిలో వస్తుందంటే..?
Movie News

ఇటు సమంత అభిమానులు, అటు రౌడీ అన్న విజయ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ “ఖుషి”. ఈ మూవీ ఇవాళ థియేటర్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్ళిపోతోంది. అక్కడక్కడా కొంత లాగ్ అనిపిస్తున్నప్పటికీ.. మూవీ అంత సరదాగా సాగిపోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ మూవీ ఓటిటి రిలీజ్ కి కూడా సర్వం సిద్ధంగానే ఉంది.

“ఖుషి” మూవీ ఇంతకీ ఏ ఓటిటిలో వస్తుందంటే..?
Samantha , Vijay Devarakonda

విజయ్ దేవరకొండ మరియు సమంతా రూత్ ప్రభు నటించిన పాన్-ఇండియన్ రొమాంటిక్ డ్రామా “ఖుషి” మూవీ ను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన సంగతి మనకి తెలిసిందే. సమంత, విజయ్ దేవరకొండల ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది . సినిమా రిలీజ్ అయినప్పటి నుంచే పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటోంది. అలాగే ఖుషి మూవీ ఏ ఓటిటి లో రిలీజ్ అవ్వబోతోంది అని తెలుగుమూవీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఖుషి మూవీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. త్వరలోనే ఖుషి సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా లో జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, మరియు శరణ్య ప్రదీప్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.