ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన నయనతార..?

ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన నయనతార..?
Latest News

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నయనతార తాజాగా ఇంస్టాగ్రామ్ లోకి అడుగు పెట్టింది . గతేడాదే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ యొక్క జవాన్ మూవీ ఇటీవలే విడుదల అయ్యింది. ఈ మూవీ లో నయనతార హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో నెట్టింట్లో బజ్ క్రియేట్ చేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌  సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన నయనతార..?
Nayanatara

తాజాగా నయనతార ఈరోజు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను ప్రారంభించారు. ఈ స్టార్ హీరోయిన్ తన బిడ్డలతో సంతోషంగా పోజులిచ్చిన క్లిప్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్దీ క్షణాల్లోనే బాగా వైరల్ అయిపొయింది. నయనతారకు సంబంధించిన ఈ ఫోటోలు చర్చనీయాంశం అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచినా కొద్దీ సేపటిలోనే ఒక మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్న కథా నాయికగా నయనతార రికార్డు క్రియేట్ చేసారు.

వీటన్నింటిలో విశేషమేమిటంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత వేగంగా ఒక మిలియన్ ఫాలోవర్స్‌ను సాధించిన హీరోయిన్‌గా నిలిచిపోయింది నయనతార . ఇంతకుముందు, కత్రినా కైఫ్ 24 గంటల పాటు అత్యంత వేగంగా ఒక మిలియన్ ఫాలోవర్స్‌గా రికార్డు బద్దలుకొట్టేసింది . కానీ నయన్ కేవలం పది మిలియన్లలో ఒక మిలియన్ సాధించడంతో చాలా తేడాతో ఆ రికార్డును అధిగమించింది. నయన్ చాలా రిజర్వడ్ గా ఉంటారు అని తెలుసు కానీ ఆమె పబ్లిక్‌గా వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు, రికార్డులు ఆటోమేటిక్‌గా బద్దలయ్యాయి.