రాఖీ రోజు భారీ ఆదాయం..TSRTC ఆల్ టైమ్ రికార్డు.. !

Huge revenue on Rakhi day..TSRTC all time record.. !
Huge revenue on Rakhi day..TSRTC all time record.. !

TSRTC సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.TSRTC కి రాఖీ పౌర్ణమి రోజు ఒక్కరోజే రూ.22.65 కోట్ల రాబడి వచ్చినట్టు వెల్లడించింది. ఆర్టీసీ చరిత్రలోనే ఇదే ఆల్ టైమ్ రికార్డు అని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. గత ఏడాది రాఖీ పండుగ రోజు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈసారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా లభించింది.ఆర్టీసీ బస్సుల్లో గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 40.91 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.

గత ఏడాదితో పోల్చితే.. అదనంగా లక్ష మంది రాకపోకలు సాధించారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒక్క రోజులోనే ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆక్యుపెన్షీ రేషియో విషయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా గత ఏడాది రికార్డును అధిగమించింది. 2022లో రాఖీ పండుగ రోజు 101.01 ఓఆర్ సాధించగా, ఈసారి 104.68 శాతం నమోదు చేసింది. నల్లగొండ జిల్లా పరిధిలోని 7 డిఫోలలో నార్కెట్ పల్లి తప్పా అన్నీ 100 శాతానికి పైగా ఓఆర్ సాధించాయి. వరంగల్ జిల్లాలో 97.05 శాతం, మహబూబ్ నగర్,ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలలో 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదు అయింది.