బీసీలకు చేయూత నిరంతర ప్రక్రియ: మంత్రి గంగుల

Continuous process of helping BCs: Minister Gangula
Continuous process of helping BCs: Minister Gangula

వెనుకబడిన వర్గాలలో కుల వృత్తులు,చేతి వృత్తుల వారికి ఒక లక్ష రూపాయల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు . బీసీలకు చేయూత నిరంతర ప్రక్రియ అని గంగులు అన్నారు. చేతి వృత్తులను సమైక్య పాలనలో ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనుమరుగవుతున్న కులావృత్తులు కాపాడాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ గారు కులవృత్తులను ఆదుకుంటున్నారని తెలిపారు.

వెనుకబడిన వర్గాలు ఆర్ధికంగా ఎదగాలని తెలంగాణ తెచ్చుకున్నమని.. 686 మంది లబ్ధిదారులకు కరీంనగర్ పద్మనాయక కళ్యాణమంటంలో చెక్కులు పంపిణీ చేశారు మంత్రి గంగుల. మళ్ళీ ఎన్నికల వస్తున్న తరుణంలో కొంతమంది వస్తున్నారు… వాళ్లకు అధికారం ఇస్తే అంత ఉడుసుకుపోతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు నేను ఎమ్మెల్యే గా ఉన్న…. అప్పుడు ఇంత అభివృద్ధి లేదని..కానీ ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ లో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని.. కుల వృత్తులను కాపాడేందుకు ఈ పథకం ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు.