ఆర్య పెళ్లి…విశాల్ నమ్మలేకపోతున్నాడట !

Vishal Gets Surprise With Aryas Wedding Card

కోలీవుడ్ నటుడు ఆర్య..తన సహనటి సాయేషా సైగల్‌ను పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి మొదటి వారంలో వీరి వివాహం జగరనుంది. ఈ సందర్భంగా ఆర్య తన పెళ్లి శుభలేఖను ఇవ్వడానికి విశాల్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్యతో దిగిన ఫోటోను విశాల్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఈ ఫోటో నా మనసుకు ఎంతో దగ్గరైంది. నమ్మలేకపోతున్నాను అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్య శుభలేఖ ఉంది. కాబోయే కొత్త దంపతులకు విశాల్ శుభాకాంక్షలు తెలియజేసాడు. ఆర్యతో పాటు త్వరలో విశాల్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే కదా. సినీ నటి అనీషాతో పెళ్లి జరగబోతుంది. త్వరలో హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నారు. అయితే..నడిగర్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విశాల్..ఆ సంఘానికి కొత్త భవనం నిర్మించేవరకు పెళ్లిచేసుకోనని శపథం చేసాడు. అది పూర్తైన సందర్భంగా త్వరలో విశాల్ పెళ్లిచేసుకోనున్నాడు.