పూరీ ఇస్మార్ట్ గోవాకి !

Ismart Shankar Second Schedule In Goa

ఇడియట్‌ లాంటి స్వభావం కలిగిన పాత్రలలో హీరోలను చూపించి ప్రేక్షకులని మెప్పించడంలో పూరి జగన్నాథ్‌ సిద్ధహస్తుడన్న పేరుంది. ప్రముఖ హీరోల కాంబినేషన్‌లో ఎన్నో హిట్లు అందించిన ఆయనకు గత కొంతకాలంగా కలిసి రావడం లేదు. టెంపర్‌ తర్వాత ఆయన రూపొందించిన ఇజం, రోగ్‌, మెహబూబా, పైసా వసూల్‌ వంటి చిత్రాలు తగినంత ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్యాయి. ఇప్పుడు తన టేకింగ్‌కు మరింత పదును పెట్టి ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కథానాయకుడిగా రామ్‌ నటిస్తున్నారు. అతని లుక్‌ చూస్తుంటే గడ్డంతో ప్రత్యేక గెటప్‌లో మాస్‌ లుక్‌తో కనిపిస్తున్నారు. పూరి సినిమాల కథానాయకుడు ఇలా స్పెషల్‌గా ఉంటాడన్న విధంగానే రామ్‌ స్పెషల్‌గా ఆకట్టుకోవడంతో అంచనాలు పెరిగాయి. ఎలాగైనా ఈ చిత్రంతో విజయం సాదించాలన్న లక్ష్యాన్ని పూరి నిర్దేశించుకున్నారట. మరోవైపు ఇస్మార్ట్‌ శంకర్‌-2 సీక్వెల్‌ చిత్రం కూడా ఆయన మదిలో ఉందట. ఇస్మార్ట్‌ శంకర్‌కు ప్రేక్షకలోకంలో లభించే స్పందనను బట్టి ఆయన సీక్వెల్‌ను కూడా తెరపైకి తెస్తారని పరిశ్రమలో వినిపిస్తోంది. అలాగే ఇస్మార్ట్ శంకర్ హైదరబాద్ షెడ్యూల్ నేటితో పూర్తయ్యిందట, ఈ విషయాన్నీ స్వయంగా చార్మీ ప్రకటించినది. తదుపరి షెడ్యూల్ కోసం గోవా వెళుతున్నామని చార్మీ ప్రకటించింది.