నేనేం బట్టలిప్పి నటించలేదుగా…?

Oviya Comments About 90ml Movie

తమిళ బిగ్ బాస్ సెన్సేషన్ ఓవియ నటించిన తాజా చిత్రం 90ఎమ్ఎల్. ఈ చిత్రం అడల్డ్ కామెడీతో కూడిన టీజర్‌లో డబుల్ మీనింగ్ డైలాగులు, ఏ జోకులు, అశ్లీల దృశ్యాలు వంటివి చాలా వున్నాయి. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఓవియాకు కోపమొచ్చేసింది. అందుకే ఈ విమర్శల గురించి ఓవియా స్పందించింది. ఐదుగురు అమ్మాయిలు ఎలాంటి కట్టుబాట్లు లేకుండా, వాళ్లకు నచ్చిన జీవితాన్ని ఆస్వాదించడమే 90ఎంఎల్‌ కథాంశమని ఇందులో రీటా అనే బ్యూటీ పార్లర్‌ నడిపే అమ్మాయి పాత్ర చేశాననీ సమాజంలో ఆడవాళ్లు ఎందుకు భయపడుతూ బతకాలన్న అంశం గురించి ఈ సినిమా చెబుతోందని ఆమె పేర్కొంది.

ఈ సినిమాలో ఓవియా ద్వంద్వార్థంతో మాట్లాడలేదు సినిమాలో రీటా అనే పాత్ర మాట్లాడిందని చెప్పుకొచ్చింది. ఇకపోతే తమిళ హీరో శింబుతో ఓవియా ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. బిగ్ బాస్ సందర్భంగా శింబు ఓవియాకు సపోర్ట్ చేశాడు. ఇంకా తాజాగా ఓవియా నటించిన 90ఎమ్ఎల్‌ లో శింబు అతిథి పాత్ర పోషించాడు. దీంతో ప్రేమ ఎప్పుడైనా ఎక్కడైనా పుట్టొచ్చని శింబు తనకు మంచి స్నేహితుడని చెప్పింది. తాను ఆయనతో వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ వుంటానని చెప్పింది. ఆయన స్నేహం జీవితాంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. సినిమాల్లో ముద్దు సన్నివేశాలు సహజమని ఈ విషయాన్ని భూతద్దంతో చూడకూడదని నేను నగ్నంగా కనిపించి ఎవర్నీ ఇబ్బందిపెట్టలేదుగా ? అని ఓవియా సమాధానం చెప్పింది.