అభినందన్ ని విడుదల చేస్తాం…కానీ ?

Abhinandan To Be Released Tomorrow

పాక్ అదుపులోకి తీసుకున్న భారత పైలట్ అభినందన్ వ్యవహారంపై ఆ దేశం స్పందించింది. పాక్ విదేశాంగ ప్రతినిధి డాక్టర్ ముహ్మద్ పైజల్ మాట్లాడుతూ అభినందన్ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తమ అదుపులో ఉన్న పైలట్ అభినందన్ గురించి భారత్ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభినందన్ విషయంలో ఏం చేయాలనేది కొద్దిరోజుల్లో నిర్ణయిస్తామని అభినందన్‌ను యుద్ధ ఖైదీగా పరిగణించాలా? వద్దా? అనే అంశంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని పైజల్ స్పష్టం చేశారు. మరోవైపు అభినందన్ విషయంలో పాక్ విదేశాంగ మంత్రి మహ్ముద్ ఖురేషి బ్లాక్‌మెయిలింగ్‌ వ్యాఖ్యలు చేసారు. ఆయనను విడుదల చేయాలని తామూ భావిస్తున్నామని కాకపోతే తమ ప్రధాని కోరినట్లు చర్చలకు అంగీకరిస్తే అభినందన్‌ను విడుదల చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి పైలట్ విడుదల నాంది పలుకుతుందని భావిస్తే అలానే చేస్తామని ఖురేషి పాక్‌లోని ఓ న్యూస్ ఛానల్‌తో చెప్పారు. భారత ప్రధాని మోదీ చర్చలకు సిద్ధంగా ఉంటే తమ ప్రధాని ఇమ్రాన్ చర్చించడానికి సుముఖంగా ఉన్నారని తెలిపారు.