లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలేజ్ డేట్ చెప్పిన వర్మ…నమ్మొచ్చా ?

Lakshmi's NTR Release Date Announced in RGV

భారీ అంచనాల నడుమ విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ మూవీస్ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు భారీ డిజాస్టర్‌లుగా మిగిలిపోవడంతో ఇప్పుడు అందరి ద్రుష్టి రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మీదే ఉంది. ఇప్పటికే అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ వర్మ తనదైన రూట్‌లో రిలీజ్ డేట్ ప్రకటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వర్మ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అత్యధిక థియేటర్స్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దాని నిర్మాతలు. సినిమా ప్రమోషన్స్‌ భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌ ఇప్పటికే సంచలనంగా మారాయి. ఈ సినిమాకి విపరీతమైన హైప్ తీసుకువచ్చేలా చేశాయి. మార్చి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో అప్పటికి ఎన్నికల వాతావారణం చాలా హాట్ హాట్‌ గా ఉండనుంది. ఈ సందర్భంలో మార్చి 22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రభావం ఎలక్షన్స్‌పై ఎంత వరకూ ఉంటుందనేది ఆసక్తిగా మారింది. అయితే వర్మకు రిలీజ్ డేట్ మార్చడం చాలా చిన్న విషయమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.