“భారతీయుడు – 2” ఈ రోజు నుండే…!

INDIAN 2 Official Second Look

తమిళ స్టార్ డైరక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హసన్ ముఖ్యపాత్రలో భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 చిత్రాన్ని రుపొందనున్నా సంగతి తెలిసిందే. 2.౦ చిత్రం విజయం తరువాత తన తదుపరి సినిమా భారతీయుడు సీక్వెల్ కు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని మొదటి షెడ్యూల్ ను ఈ రోజు చెన్నైలో ప్రారంభించనున్నాడు. ఇటివల అక్కడ పొంగల్ కానుకగా కమల్ హసన్ యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సు లభించింది. ముఖ్యంగా కమల్ అభిమానులకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ పొంగల్ కి తమిళ స్టార్ హీరోస్ సినిమాలు విడుదల చేస్తుంటే, కమల్ గారు ఫస్ట్ లుక్ విడుదల చేసి తమను సంతోష పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకా ఈ చిత్రంలో తెలుగు స్టార్ కమిడియన్ వెన్నల కిషోర్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే తమిళ నటుడు శింభు, మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తుంది. ఈ చిత్రాని లైక ప్రొడక్షన్స్ తెలుగు.తమిళ, హింది, మలయాళం, భాషలో నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాని 2020కి సంక్రాంతి కానుకగా విడుదల చేయ్యనున్నాడు.