జాతీయ పతాక రూపశిల్పి జయంతి స్పెషల్ …

india national flag designer pingali venkayya birthday

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మానవులు పుడతారు … చనిపోతారు. కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు … వీరిని “మృతంజీవులు” అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు. ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు. తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -పింగళి వెంకయ్య – గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ….

జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య తేదీ: ఆగస్ట్‌ 02, 1878లో కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. బొంబాయిలో సైనిక శిక్షణ పొంది ఆఫ్రికా వెళ్లారు. బోయరు యుద్ధంలో పాల్గొని తిరిగి వస్తూ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్‌ పర్యటించారు. 1911-44 వరకు బందరు జాతీయ కళాశాలలో అధ్యా పకునిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో భూ గర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. 1924 నుండి 1944 వరకు నెల్లూరులో ఉండి మైకా గురించి పరిశోధనలు చేశారు.

బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి ‘తల్లిరాయి’ అనే పుస్తకం రాశారు. 1916లో ‘భారతదేశమునకు ఒక జాతీయ పతాకం’ అనే గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు. 1921లో బెజవాడ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ ఆదేశానుసారం త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. గాంధీ సూచన మేరకు దానిపై రాట్నం గుర్తు చేర్చారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సూచనమేరకు రాట్నం స్తానంలో అశోకచక్రం చేర్చబడింది. ఏప్రిల్‌ 13, 1936 నాటి ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యగారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. శ్రీశ్రీ

మరిన్ని వార్తలు:

టీడీపీకి కాంగ్రెస్ అధ్యక్షుడా..?

కేటీఆర్, లోకేష్ కొత్త బిచ్చగాళ్లు

ఇండియాకే అమెరికా రెడ్ కార్పెట్