కేటీఆర్, లోకేష్ కొత్త బిచ్చగాళ్లు

CPI Narayana Controversial Comments On KTR & Lokesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కమ్యూనిస్టు నారాయణ, చికెన్ నారాయణగా పాపులరైన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇద్దరు సీఎంల వారసులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నారాయణ ఎవరో తెలీదన్న కేటీఆర్ ను, విజయవాడ కమ్యూనిస్టుల వల్లే వెనుకబడిందన్న లోకేష్ ను కడిగిపారేశారు. రాజకీయాల్లో కొత్త బిచ్చగాళ్లైన వీరిద్దరు తమ తండ్రుల్ని అడిగితే తానెవరో తెలుస్తుందన్నారు.

నారాయణ సీపీఐ సీనియర్ లీడర్. డౌటేం లేదు. మంచి పోరాట యోధుడు కూడా. అంతకు మించి వ్యూహకర్త. కానీ చాలా సందర్భాల్లో నోరు జారే దురలవాటు మాత్రం ఆయనకు పోవడం లేదు. ఇప్పుడు అదే అలవాటు కంటిన్యూ అయింది. మరి నారాయణ కామెంట్స్ కు కేటీఆర్, లోకేష్ ఏం స్పందిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కేటీఆర్ బాగా తగులుకుంటారనే టాక్ వినిపిస్తోంది.

టీఆర్ఎస్ నేతలు సహజంగానే వాగ్ధాటితో ప్రతిపక్షాల్ని బెదరగొడదతారు. కాంగ్రెస్ నేతలు పొరపాటున ఒక్క విమర్శ చేస్తే.. వంద రకాలుగా ఎధురుదాడి చేసి వారిని ఆత్మరక్షణలోకి నెడతారు. ఈ ఎదురుదాడిలో మొత్తం అన్ని పార్టీల్ని అధిగమించి తమ కంటూ ప్రత్యేక ముద్ర తెచ్చుకున్నారు గులాబీ నేతలు. మరిప్పుడు తమ పార్టీ భవిష్యత్తైన కేటీఆర్ ను నారాయణ అంత మాటంటే.. శ్రేణులు ఊరుకుంటాయా.. అంటే చూడాల్సిందే.

మరిన్ని వార్తలు:

ఇండియాకే అమెరికా రెడ్ కార్పెట్

ఇండియాకే అమెరికా రెడ్ కార్పెట్